స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి' రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది. గురువారం జరిగిన ఎపిసోడ్ -9 లో.. స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుండగా పడిపోయిన స్వప్నని చేతిలో ఎత్తుకొని తీసుకెళ్తాడు రాజ్.
అక్కడ ఉన్నవాళ్ళంతా వాళ్ళిద్దరినే ఆశ్చర్యంగా చూస్తారు. స్వప్నని తన రూంలో ఉంచి సర్వెంట్ ని పిలిచి వేడినీళ్ళతో కాపడం పెట్టిస్తాడు. రాజ్ రూం బయట ఉండి స్వప్న కి ఎలా ఉందోనని టెన్షన్ పడుతుంటాడు. ఎలాగైనా రాజ్ కి దగ్గర అవ్వాలని గట్టిగా అరుస్తుంది. అప్పుడే రాజ్ లోపలికి వస్తాడు. సర్వెంట్ చేతినుండి టవల్ తీసుకొని స్వప్న కాలుకి కాపడం పెడతాడు. దీంతో స్వప్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదంతా గమనిస్తూ స్వప్న తల్లి కనకం తన మొబైల్ లో రాజ్, స్వప్నల ఫోటో తీస్తుంది.
ఆ తర్వాత రాజ్ కాసేపటికి రూం బయటకి వస్తాడు. బయట సీతారామయ్య ఇంకా రాజ్ తమ్ముళ్ళు ఉంటారు. ఎలా ఉందని సీతారామయ్య అడుగగా.. "చాలా సుకుమారంగా పెరిగినట్టుంది తాతయ్య.. కాలు బెణికింది. డాక్టర్ కి కాల్ చేసాను వస్తున్నా అన్నాడు" అని చెప్తాడు రాజ్. అక్కడే ఉన్న వాళ్ళ తమ్ముడు.. "అన్నయ్యా.. నువ్వు ఆ అమ్మాయిని ఎత్తుకొని తీసుకొచ్చిన దాని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు" అని రాజ్ తో అంటాడు. మరొక తమ్ముడు కృష్ణ "అవును అన్నయ్యా.. అందమైన అమ్మాయిని ఎత్తుకొని వచ్చావ్" అని అంటాడు. "అవును అందమే.. నేను ఇష్టపడేంత అందం" అని రాజ్ మనసులో అనుకుంటాడు.
ఆ తర్వాత కాసేపటికి డాక్టర్ వస్తాడు. స్వప్న కాల్ ని చూస్తూ ఎలా ఉందమ్మా అని అడుగుతాడు. తను నొప్పిగా ఉందని చెప్తుంది. మరి రెస్ట్ తీసుకోండి అని చెప్తాడు. స్వప్న దగ్గరికి వచ్చిన రాజ్ కుటుంబసభ్యులు.. "మీరెవరు? ఎక్కడుంటారు? అనుకుంటూ ఆరా తీస్తూ" ఉంటారు. ఇక ఇక్కడే ఉంటే దొరికిపోతాం అని స్వప్న, కనకం అనుకుంటారు. ఎలాగైనా బయటకు వెళ్ళిపోవాలని అని అనుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు తప్పించుకున్నారా లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.